- Advertisement -

రజినీకాంత్ నెక్స్ట్ లెవెల్ స్కెచ్!

- Advertisement -

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం తన బ్లాక్‌బస్టర్ హిట్ ‘జైలర్’ సీక్వెల్ షూటింగ్‌లో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కలిసి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు స్కై-హైలో ఉన్నాయి. ‘జైలర్’ రోల్‌లో తన ఓల్డ్ ఏజ్ మాస్‌తో వెండితెరపై విధ్వంసం సృష్టించిన తలైవా.. ఈ సీక్వెల్‌లో అంతకుమించి అనేలా ఫ్యాన్స్‌కు గట్టి విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అయితే.. ఈ మాస్ యాక్షన్ హంగామా నడుస్తుండగానే.. రజినీకాంత్ తన తదుపరి లైనప్‌లో ఒక అత్యంత ఇంట్రెస్టింగ్ అండ్ సంచలన పాత్రలో కనిపించబోతున్నారనే క్రేజీ రూమర్ ఇప్పుడు కోలీవుడ్ ట్విట్టర్ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 173వ చిత్రం (#Thalaivar173) కు ‘ఓ మై కడవులే’ ఫేమ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో రజినీకాంత్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక సరికొత్త గెటప్‌లో.. ఒక ‘మిడ్ ఏజ్డ్ డాక్టర్’ (Mid-aged Doctor) పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిలింనగర్ సమాచారం. సాధారణంగా కమర్షియల్ మాస్ పాత్రలు చేసే తలైవా.. చాలా ఏళ్ల తర్వాత ఒక ప్రయోగాత్మక డాక్టర్ క్యారెక్టర్ చేయబోతుండటం గమనార్హం. ఇటీవలె ఈ వింటేజ్ డాక్టర్ గెటప్‌కు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని.. రజినీ లుక్ చాలా స్టైలిష్ అండ్ మైండ్ బ్లోయింగ్‌గా లాక్ చేశారని టాక్ వినిపిస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక క్రేజీ ప్రాజెక్ట్‌కు మరో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే.. ఈ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్’ (RKFI) పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇద్దరు లెజెండ్స్ ఇలా నటుడిగా, నిర్మాతగా కలవడం ట్రేడ్ వర్గాల్లో ఒక రేంజ్ లో హాట్ టాపిక్‌గా మారింది. వీరికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఈ చిత్రానికి మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -