Wednesday, May 1, 2024
- Advertisement -

హిట్ కొడుతాడో లేదో చూడాలి మరి!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఈ సమ్మర్లో పెద్ద సినిమాగా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా రానించలేకపోయింది. పవన్ తన తరహలో అభిమానులను అలరించిన సినిమా కథలో దమ్ము లేకపోవడం వల్ల ప్రేక్షకులకు సరిగ్గ కనెక్ట్ కాలేకపోయింది.

కానీ కామీడి పరంగా చూస్తే మాత్రం ఈ సినిమా పవన్ అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. ఈ సినిమా అంతగా అభిమానులను అలరించకపోయేసరికి బన్నీ సినిమా అయిన ఈ సమ్మర్ లో పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారు. నిన్న భారీ ఎత్తున అల్లు అర్జున్ సరైనోడు సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో ఇంట్రవేల్, క్లైమాక్స్ తప్పిస్తే సినిమాలో పెద్దగా ఏం లేదని చెప్పాలి. కామీడి కూడా అంతగా లేదు.

ఎదో ఉందని ఊహించుకొని థీయేటర్స్ వెళ్ళిన వారికి గట్టి నిరాశ మిగులుతుంది. సరైనోడు కన్న సర్దా గబ్బర్ సింగ్ ఎంతో కొంత బెట్టర్ అని అంటున్నారు. సర్దార్ లో సరైన కథ లేదు కాని ఉంటే మాత్రం ఈ సమ్మర్ కి బాక్స్ ఆఫీ వద్ద బంఫర్ హిట్ కొట్టాల్సిన సినిమా అని అంటున్నారు అభిమానులు. ఏది ఏమైన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రెండు పెద్ద సినిమాలో అభిమానులను నిరాశపరిచాయి. మరి సుప్రిమ్ తో వస్తున్న సాయి థరామ్ తేజ్ అయిన సమ్మర్ లో హిట్ కొడుతాడో లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -