Tuesday, May 14, 2024
- Advertisement -

రాజ్యసభకు మళయాల స్టార్ సురేష్ గోపి

- Advertisement -

సురేష్ గోపి. మళయాళంలో సూపర్ స్టార్. ఆయన బిజెపి అభిమాని కూడా. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ చాలా చోట్ల ప్రసంగాలు కూడా చేశారు. దీంతో మోదీ ఈ సూపర్ స్టార్ ని రాజ్యసభకు నామినేట్ చేసింది. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరువంతనంతపురం నుంచి శాసనసభకు పోటీ చేసేందుకు టిక్కట్టు కూడా ఇవ్వాలనుకుంది.

ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. అదేమిటంటారా.. సురేష్ గోపి అనేక సినిమాల్లో హీరోగా నటించారు.  ఆ సినిమాల్లో విలన్లందరూ దాదాపుగా రాజకీయ నాయకులే. వీరిని ఉద్దేశించి హీరో సురేష్ గోపి అనేక డైలాగులు కూడా వేసేవాడు. అలాంటి ఓ డైలాగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అంతే కాదు.. ఈ డైలాగ్ సురేష్ గోపి రాజకీయ జీవితానికే ఇబ్బంది కలిగించేదాగా మారింది.

ఓ సిినిమాలో విలన్ దొడ్డిదారిన ఓ పదవిలోకి వస్తాడు. అతడ్ని ఉద్దేశించి హీరో సురేష్ గోపి బాగా డబ్బున్న ఎన్నారైలు, మద్యం వ్యాపారులు తమ దగ్గరున్న నల్లధనాన్ని ఎరగా చూపి పార్లమెంటుకి వెళ‌్తారని అంటారట. దీంతో ఆ డైలాగుని చాలా మంది సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. నేడో రేపో రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్న హీరోకు ఇది తలనొప్పిగా మారింది. తెరపై మాత్రమే మేం హీరోలం.. ఆ తర్వాత మేము అదే బాపతు అంటాడేమో సురేష్ గోపి అని పోస్టులు పెడుతున్నారు. అందుకే  వ్యక్తుల బతుకులు వారి వారి ఇష్టం.. పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అనే శ్రీశ్రీ మాటల్ని సినిమా వాళ్లు.. రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -