Sunday, April 28, 2024
- Advertisement -

నాని 31..అప్పుడే గాసిప్స్ షురూ!

- Advertisement -

వరుస సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నారు హీరో నాని. తాజాగా నాని 31వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. నానితో అంటే సుందరానికి చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ ఆత్రయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా నానికి జోడిగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది.

ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిందో లేదో అప్పుడే పుకార్లు షికార్ చేస్తున్నారు. ఈ చిత్రం లో విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య విలన్ రోల్ లో కనింపచనున్నారట. అక్టోబర్ 24న సినిమా షూటింగ్ ప్రారంభంకానుండగా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇక సూర్య టాలీవుడ్‌లో పలు సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. చాలాకాలం గ్యాప్‌ తర్వాత తిరిగి విలన్‌గా వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం లో నాని చేస్తున్న హాయ్ నాన్న డిసెంబర్ 7, 2023 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -