Sunday, May 5, 2024
- Advertisement -

ఆ విషయంలో మోడీనే ఫాలో అవుతున్న జగన్!

- Advertisement -

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీకైనా సోషల్ మీడియా కీలకమే. అధికారంలోకి రావాలన్న, అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించాలన్న సోషల్ మీడియాది కీ రోల్. ఇక 2014,2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజయంలో కీలక పాత్ర పోషించింది సోషల్ మీడియానే. ఇక ఏపీలో జగన్ అధికారంలోకి రావడంలోనూ సోషల్ మీడియాదే ఇంపార్టెంట్ రోల్.

అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం పాజిటివ్ కంటే నెగటివే ఎక్కువ స్ప్రెడ్ అవుతోంది. రాజకీయ నాయకుల వ్యక్తిగత, ఫ్యామిలీని టార్గెట్ చేసే వరకు వెళ్లింది వ్యవహారం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతల వ్యక్తిగత విషయాలు, ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేసే ప్రచారానికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. గతంలో బీజేపీ అనుకూల సోషల్ మీడియాలో ఈ విధంగానే చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే వెంటనే తేరుకున్న మోడీ పార్టీ శ్రేణులకు క్లీయర్ కట్‌గా వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లవద్దని సూచించిన పరిస్థితి. ఇప్పుడు ఇదే స్టాండ్‌ను ఫాలో అవుతున్నారు జగన్.

ఈ అసత్య ప్రచారాన్ని ఎవరు మొదలు పెట్టినా తప్పే అని భావిస్తున్న జగన్‌…ఇకపై ఎవరు వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లవద్దని నేతలకు సూచించారట. ప్రధానంగా మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సైతం క్లీయర్‌కట్‌గా ఆదేశాలిచ్చారు జగన్. కేవలం వైసీపీ సంక్షేమ పథకాలను మాత్రమే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని వెల్లడించారు జగన్. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అసత్య ప్రచారాలను ట్రోల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలకు వెనుకాడొద్దని పోలీసులకు సూచించిన నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -