గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ సక్సెస్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. దాంతో బాలయ్య బడ్జెట్ ని కూడా పెంచారు. శాతకర్ణి తర్వాత కృష్ణ వంశీతో ఓ సినిమా చేద్దామని బాలయ్య అనుకున్నారు. రైతు అనే టైటిల్ పరిశీలిస్తున్న ఆ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే రైతు కాన్సెప్ట్ తో మెగాస్టార్ చిరు ఖైదీ నంబర్ 150 సినిమా తీయడంతో.. ఆ స్టోరీని కొంత కాలం పక్కన పెట్టారు.
గత నెల రోజుల నుంచి కొత్త కొత్త కథలను వింటున్నారు బాలయ్య. వాటిలో అన్నిటికంటే తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ చెప్పిన కథ బాగుందని సమాచారం. కథ వినగానే ఒకే చెప్పేద్దామని అనుకున్నారు. అయితే కేఎస్ రవికుమార్‍కి ప్రస్తుతం హిట్స్ లేక ఫాంలో లేడు అని కొంత మంది చెప్పడంతో బాలయ్య ఆలోచనలో పడ్డారు. పైగా మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత కథను స్క్రిప్ట్ గా మార్చే పనిలో పడ్డారు.
తండ్రి సినిమా చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని గ్రహించిన బాలయ్య కేఎస్ రవికుమార్ చెప్పిన కథతోనే తన 101వ సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్యను కేఎస్ రవికుమార్ మాస్ మసాలతో నిండిన ఫ్యాక్షన్ స్టోరీ చెప్పి మెప్పించాడట. సో తనకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫార్ములాతోనే ఇప్పుడు వచ్చేందుకు బాలకృష్ణ రెడీ అవుతున్నారన్నమాట.
{youtube}L-eA2XqP_Y4{/youtube}
Related