- Advertisement -

‘టాక్సిక్’…‘తబాహీ’అదుర్స్!

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ‘తబాహీ’ పాటతో ప్రారంభమయ్యాయి. ఈ రొమాంటిక్ ట్రాక్‌ను విశాల్ మిశ్రా పాడగా తెలుగు లిరిక్స్‌ను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాటలో యష్ సరసన కియారా అద్వానీ కనిపిస్తున్నారు.

మొదటి వినికిడికి పాట బాగానే అనిపించినా, బలమైన ప్రభావం చూపేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మ్యూజిక్ సాధారణంగా అనిపించవచ్చు. సినిమాకి తగ్గ శక్తివంతమైన రొమాంటిక్ నంబర్ ఆశించిన వారికి కొంత నిరాశ కలగొచ్చు. ముఖ్యంగా ఇది లిరికల్ వీడియో కాకపోవడం, హీరో–హీరోయిన్ స్టిల్స్ లేకపోవడం అభిమానులను నిరుత్సాహపరచవచ్చు.

ఈ చిత్రాన్ని వెంకట్ కె. నారాయణ, యష్‌లు వరుసగా కేవీఎన్‌ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మార్చి 19, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్‌కు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్, తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా తదితరులు అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -