మార్చి నెల ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రారంభమైంది. ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్ కానున్న సినిమాల జాబితాను పరిశీలిస్తే..
పాణిగ్రహణం
ETV Winలో ‘కథాసుధ’ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ మోస్తరు స్పందన తెచ్చుకుంది. సురేష్ నరెడ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహిత్ పెదాడ, నాగసాయి, దేవిశ్రీ కైప, ప్రభావతి కీలక పాత్రల్లో నటించారు.
ఓం శాంతి శాంతి శాంతిహి
ఓం శాంతి శాంతి శాంతిహి.. మలయాళ హిట్ ‘జయ జయ జయ జయ హే’కు అధికారిక తెలుగు రీమేక్. Ahaలో మార్చి 4, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు మార్చి 3 నుంచే అందుబాటులో ఉంటుంది.
దేవగుడి
అభినవ్ శౌర్య, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ గ్రామీణ డ్రామా Sun NXTలో మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
చరిత కామాక్షి
దివ్య శ్రీపాద, అభయ్ నవీన్ నటించిన ఈ భావోద్వేగ డ్రామా ETV Winలో మార్చి 5 నుంచి విడుదల కానుంది.
సుబేదార్
Subedaarలో Anil Kapoor, రాధికా మదన్ ప్రధాన పాత్రల్లో నటించారు. Amazon Prime Videoలో మార్చి 5 నుంచి ప్రసారం.
విత్ లవ్
With Love మార్చి 6 నుంచి Netflixలో తమిళం, తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్.
గాంధీ టాక్స్
Gandhi Talks ZEE5లో మార్చి 6 నుంచి అందుబాటులోకి రానుంది.
విక్రమ్ ఆన్ డ్యూటీ
ఈ తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ Jio Hotstarలో మార్చి 6న ప్రీమియర్ కానుంది.
ది రాజా సాబ్
The Raja Saab ఇప్పటికే జియో హాట్‌స్టార్‌లో ఉంది. హిందీ వెర్షన్ మార్చి 6న చేరే అవకాశం ఉంది.
హలో బచ్చోన్
ఫిజిక్స్‌వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్ Netflixలో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్.
