Saturday, May 4, 2024
- Advertisement -

నాగ్ తో టబు మళ్లీ రొమాన్స్ చేస్తుందా..?

- Advertisement -

టాలీవుడ్ లో కింగ్ నాగార్జునకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాగ్ కొడుకులు హీరోలుగా సినిమాలు చేస్తున్నప్పటికి.. నాగ్ ని మాత్రం బీట్ చేయలేకపోతున్నారు. కేవలం కలెక్షన్ల విషయంలో మాత్రమే కాదు అందం విషయంలో కూడా పోటీ ఇవ్వలేకపోతున్నారు. నాగ్ ఇంకా నవ మన్మధుడు గా కొనసాగుతున్నారు. తాజగా నాగరున రాజు గారి గది 2 సినిమాతో హిట్ అందుకున్నారు.

ఇప్పుడు నాగ్ నెక్ట్స్ సినిమా ఎంటి అనేది ఇంకా చెప్పలేదు. కానీ తాజాగా రెండు మూడు కథలను లైన్ లో పెట్టినట్లు కొన్ని మీడియా ఇంటర్వ్యూలలో చెప్పారు. అందులో నానితో కలిసి ఒక మల్టిస్టారర్ చేస్తానని కూడా తెలిపారు. అంతేకాకుండా విలక్షణ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నని.. ఆ మూవీ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని తెలిపాడు. అయితే ఈ సినిమాలో టబు కూడా కనిపించబోతుందట. అప్పట్లో నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే చిత్రాల్లో కలిసి నాగార్జునతో నటించిన టబు.. తన ఫెవరెట్ యాక్టర్ నాగ్ అని తరుచు చెబుతుంటుంది.

అంతేకాకుండా చాలా మంచి స్నేహితుడని కూడా చెప్తుంటుంది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నాగ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుస్తానని చెబుతూ ఉంటుంది. అయితే వర్మ తో నాగ్ చేయబోయే సినిమాలో టబు ఏ పాత్ర చేస్తుందనే దానిపై ఆసక్తి పేరిగింది. నిన్నపెళ్లాడుతా సినిమాలో మాదిరి రొమాన్స్ చేస్తుందా లేక.. ఏదైన ముఖ్య పాత్ర పోషిస్తుందా అనేది చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -