మరో సినిమా జంట విడాకులు తీసుకోనుందా..? విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్ చెప్పనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి విజయ్ వర్మతో తమన్న బాటియా డేటింగ్ వార్తలు వచ్చినప్పుడే అంతా షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో పలు ఈవెంట్‌లలో ఇద్దరూ కలిసి కనిపించడం, లస్ట్ స్టోరీస్ 2లో హద్దు మీరి చేసిన రొమాన్స్‌తో వీరి బంధం గురించి బయటపడింది.
అయితే తాజాగా తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ తమ బంధానికి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని అంతా అనుకుంటుండగా బ్రేకప్ వార్త బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.
అయితే తమన్నా మరియు విజయ్ ప్రేమ కథ ముగిసినప్పటికీ వారి మధ్య స్నేహబంధం కొనసాగుతోందని వారి సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ తమ-తమ కెరీర్‌లపై దృష్టి సారించాలనే నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా వీరిద్దరి బ్రేకప్ వార్త మాత్రం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసిందనే చెప్పాలి.