Friday, March 29, 2024
- Advertisement -

తమన్నా అందరికీ ఐరన్ లెగ్, ఈ హీరోకి గోల్డెన్ లెగ్

- Advertisement -

కొంత మందికి కొన్ని సెంటిమెంట్ లు ఉంటాయి. సామాన్యుల సంగతి ఎలా ఉన్నా సినిమా వారికి ప్రత్యేకమైన సెంటిమెంట్ లు భలే గమ్మత్తుగా ఉంటూ ఉంటాయి. ప్రస్తుతం స్పీడున్నోడు సినిమాని రేపు విడుదల చెయ్యడానికి సిద్దం అవుతున్న బెల్లం కొండ శ్రీను తన పాలిట అదృష్ట దేవత గా తమన్నా గురించి ఫీల్ అవుతున్నాడట.

జనరల్ గా అందరూ తమన్నా న్ని ఐరన్ లెగ్ అని పిలుస్తారు పాపం. ఆమె బాహుబలి సినిమా కి ముందర వరకూ అన్నీ ప్లాపులతోనే గడిపింది. పెద్ద హీరోలూ చిన్న హీరోలూ అని లేక ఎవరితో తీసినా ప్లాపే పాపం. ఆ మధ్య అల్లుడు శ్రీను సినిమాలో ఆమెని ఒక ఐటెం సాంగ్ కోసం తీసుకున్న శ్రీను పరవాలేదు అనిపించే సినిమా తీసాడు. ఇప్పుడు మళ్ళీ తన స్పీడున్నోడు కోసం ఆమెనే ఎంచుకున్నాడు మనోడు.

ఒక పక్క హీరోయిన్ సోనరికా ఉండగా ఆమె కంటే ఎక్కువగా తమన్నా నే చూపిస్తున్నారు ప్రమోషన్ లో కూడా. యాడ్స్ లో కూడా తమన్నా స్టిల్స్ ఎక్కువగా కనపడుతున్నాయి . ఆమె హీరోయిన్ అని చాలా మంది అనుకునే రేంజ్ లో ప్రమోషన్ జరుగుతోంది. ఎక్కడ చూసినా ఆమె అందాలతో ప్రమోషన్ జరిగిపోతోంది. ఒక పక్క తమన్నా శ్రీనివాస్ కి అదృష్ట హీరోయిన్ కాగా బాహుబలి తరవాత బెంగాల్ టైగర్ తో తమన్నా గోల్డెన్ లెగ్ గా మారింది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు కూడా. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -