Tuesday, May 14, 2024
- Advertisement -

సమంతను తాను కొట్టలేదు మొర్రో అంటున్న దర్శకుడు!

- Advertisement -

‘గోలీసోడా’ వంటి తమిళ చిత్రంలో బాగా గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు విజయ్ మిల్టన్.

ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో విక్రమ్ ఆ దర్శకుడితో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా రెడీ అయ్యింది కూడా. “10 ఎన్నదుకుళ్ల ‘ అనే పేరుతో రూపొందిన ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. 

ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఆ సినిమా షూటింగ్ స్పాట్ లో దర్శకుడు విజయ్ మిల్టన్ సమంతపై చేయి చేసుకొన్నాడనే ప్రచారం మొదలైంది. ఆమెపై  ఒక దశలో ఆగ్రహంతో ఊగిపోయిన మిల్టన్ ఆమెను కొట్టాడని ప్రచారం జరుగుతోంది. దీంతో సమంత అభిమానుల్లో ఆ దర్శకుడిపై ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని ఆ దర్శకుడు అంటున్నాడు. తాను సమంతను  అసలు ఎందుకు కొడతాను ? అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. 

సమంత చాలా మంచి నటి అని.. ఆమెతో పని చేయడం చాలా కంఫర్ట్ అనిపించిందని.. తను చాలా కష్టపడి పని చేసే నటి అని..డూపులకు బదులుగా యాక్షన్ సీన్లలో చేయడానికి కూడా తనే ముందుకు వస్తుందని విజయ్ ఆమెకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అలాంటి ఆమెను తను ఎందుకు కొడతానని అతడు అంటున్నాడు. మరి నిప్పులేనిదే పొగ రాదు కదా.. ఇంతకీ ఆ సినిమా షూటింగ్ స్పాట్ ఏం జరిగిందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -