Tuesday, May 14, 2024
- Advertisement -

హీరో తనీష్ డ్రగ్స్ కి ఎలా ఎడిక్ట్ అయ్యాడంటే..?

- Advertisement -

కొన్ని సినిమాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. అందులోని పాత్రలు సరిగ్గా సెట్ అవుతుంతాయి. కాకపోతే అవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలు జరిగితే.. కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని సార్లు ఆవేదన మిగులుతోంది. తాజాగా యంగ్ హీరో తనీష్ కు ఆ అనుభవం ఎదురైంది. ప్రస్తుతం డ్రగ్స్ కేసు.. టాలీవుడ్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కొందరికి కెల్విన్ తో లింక్ ఉందని.. వారికి సిట్ అధికారుల నుంచి నోటీసులు వెళ్లాయి. అలా నోటీసులు అందుకున్న వారిలో యంగ్ హీరో తనీష్ కూడా ఉన్నాడు. తనీష్ బాల నటుడిగా చాలా సినిమాలు చేసాడు. అ తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు చేసాడు. కాకపోతే పెద్ద స్థాయి హిట్ కొట్టాలేకపోయాడు. తాజాగా కృష్ణవంశీ డైరెక్షన్ లో నక్షత్రం సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కాబోతుంది. ఇందులో తనీష్ డ్రగ్స్ ఎడిక్ట్ గా తనీష్ కనిపించనున్నాడు. డ్రగ్స్ కు అలవాటు పడి ఆవేశంతో రగిలిపోయే యువకుడిగా ఈ మూవీలో కనిపిస్తాడట.

ఇలా డ్రగ్స్ ఎడిక్ట్ రోల్ చేస్తున్న వేళ.. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా డ్రగ్స్ వాడినట్లు అనుమానంతో అతడికి పోలీసులు నోటీసులు ఇవ్వడం కాకతాళీయమనే చెప్పాలి. సాధారణంగా కృష్ణవంశీ మూవీస్ లో విలన్ పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. సినిమాలో హీరోకి రెంజ్ లో విలన్ పాత్ర ఉంటుంది. అయితే ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తోందని తనీష్ ఆశలు పెట్టుకున్నాడు. ఏది ఏమైన సినిమాలో చేసిన పాత్ర.. నిజ జీవితంలో ఎదురైయితే.. ఎదురుకోవడం చాలా కష్టమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -