Sunday, April 28, 2024
- Advertisement -

బాబు దిగ‌జారుడు రాజ‌కీయానికి ఇది పారాకాష్ట‌…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం చంద్ర‌బాబు మ‌రింత దిగ‌జారుడు రాజ‌కీయానికి పాల్ప‌డుతున్నారు. ప‌రిస్థితులు చూస్తుంటె ఓట‌మి భ‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గెల‌వ‌లేమ‌ని తేలిపోవ‌డంతో మంత్రి వ‌ర్గాన్ని అంతా నంద్యాల‌లో మ‌కాం వేసి అడ్డ‌గోలు వ‌రాలు గుప్పిస్తు ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేస్తున్నారు. ఇవికూడా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో సెంటీమెంట్ అస్త్రాన్ని ప్ర‌యేగిస్తున్నారు బాబు.
నంద్యాలలో రెండురోజులపాటు ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు పర్యటించారు.ఆదివారంనాడు ఆయన నంద్యాలలో టిడిపి మున్సిఫల్‌కౌన్సిలర్లు, సర్పంచులు, జడ్‌పిటిసి సభ్యులు, ఎంపీటీసీలు, టిడిపి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. నంద్యాలలో పోటీకి దూరంగా ఉండాలని రాజకీయ సంప్రదాయాన్ని వైసీపీ తిలోదకాలు ఇవ్వడమే చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు.
ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌ని తేలిపోవ‌డంతో సెంటీమెంట్ అస్త్రాన్ని అందుకున్నారు.ఏడాదిన్నర పదవి కోసం తల్లిదండ్రులులేని బిడ్డలపై పోటీ చేయడం న్యాయమేనా అని బాబు ప్రశ్నించారు. రాజకీయ సంప్రదాయాలు, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వకూడదని ఆయన మండిపడ్డారు. 2014లో ఆళ్ళగడ్డలో ఎన్నికల ప్రచార సమయంలో శోభానాగిరెడ్డి చనిపోయిన సమయంలో ఐదేళ్ళ సమయం ఉన్నా పోటీపెట్టకుండా ప్రతిపక్షానికే అవకాశం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
పార్టీ పిరాయింపుల‌ను ప్రోత్స‌హించి మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన‌ప్పుడు గుర్తుకు రాలేదేమొ విలు వ‌ల‌గురించి మాట్లాడే బాబుకు ఇప్పుడే గుర్తుకొచ్చ‌న‌ట్లున్నారు. గెలుపు కోసం ఇంకెంత‌కైనా వెల్తార‌నేదానికి ఇది నిద‌ర్శ‌నం కాబోలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -