Friday, May 3, 2024
- Advertisement -

తాప్సీ కి తలనొప్పిగా మారాడు

- Advertisement -

సినిమా తారలు సొంత వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. చాలమంది లాగానే ఢిల్లీ బేబీ తాప్సీ పన్ను కూడా తన సోదరితో కలిసి ఓ వ్యాపారం మొదలుపెట్టింది. వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్‌గా రన్ చేసేస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. వ్యాపారం బాగానే ఉంది ఓ అభిమాని కారణంగా ఇబ్బందులు మొదలైపోయాయి.

కోల్‌కతాకు చెందిన ఓ వీరాభిమాని తన పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్‌గా ఉండాలంటూ తాప్సీ సంస్థను కోరాడు. ఇది ఓకే కానీ.. తాప్సీ చీఫ్ గెస్ట్‌గా వస్తేనే ఈ కాంట్రాక్ట్ ఇస్తానని మెలిక పెట్టాడు ఆ ఫ్యాన్.దీంతో ఈ వ్యవహారాన్ని అక్కడితో వదిలేసి కాంట్రాక్ట్ గురించి మర్చిపోయింది తాప్సీ అండ్ టీం. అయితే ఆ వీరాభిమాని మాత్రం.. వీళ్లను వదల్లేదు. తన పెళ్లికి తాప్సీ రావాల్సిందే అని పట్టుపట్టాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అతనికి ఇంకా పెళ్లి ఫిక్స్ కాలేదు కనీసం అమ్మాయిని కూడా చూడలేదట.

‘ముందు నువ్వెళ్లి పెళ్లి కూతురును వెతుక్కో. నీకు పెళ్లి కుదిరినా ఆ మ్యారేజ్‌కి వచ్చేందుకు నాకు షెడ్యూల్ ఖాళీ లేదని చెప్పా. అయితే.. అతను రూట్ మార్చేసి నా దగ్గర స్టోరీ ఉంది డైరెక్టర్‌ని పంపుతా అంటూ కొత్త స్టోరీ మొదలుపెట్టాడు’ అని చెప్పింది తాప్సీ. తనకు చాలా మంది ఫ్యాన్స్ తగిలారు కానీ.. ఇలా ఓ అభిమానితో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు అంటోంది తాప్సీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -