Monday, May 6, 2024
- Advertisement -

డైరెక్టర్ తేజా తో – హీరో రానా

- Advertisement -

ప్రేమకథలను అటు తిప్పి ఇటు తిప్పి చెప్పే దర్శకుడు తేజ ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నాడట. ఇన్నాళ్లు తన ప్రేమకథలతో అలరించేందుకు ప్రయత్నించిన తేజ మొదట్లో కాస్త పర్వాలేదనిపించినా ఈ మధ్య అన్ని ఫ్లాప్స్ అవుతున్నాయి. అందుకే ఈసారి కాస్త కొత్త కథని ట్రై చేస్తున్నాడట.

అంతేకాదు ఈసారి ఆల్రెడీ స్టార్ అయిన హీరోను తన సినిమాలో సెలెక్ట్ చేస్తున్నాడని టాక్. ఆ క్రమంలోనే దగ్గుబాటి హీరో రానాను తన సినిమాలో హీరోగా ఓకే చేశాడట. రానాతో చర్చలు కూడా జరిపాడట తేజ.తేజ దర్శకత్వంలో చేసేందుకు రానా కూడా ఓకే చెప్పేశాడట కూడా. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుందని టాక్.

లక్ష్మి కళ్యాణం సినిమాతో కాజల్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది తేజనే. అందుకే సినిమాలో అడుగగానే ఓకే చెప్పేసిందట ఈ భామ. సో ఇన్నాళ్లు కొత్త వారితో సినిమాలు తీసి రిలీజ్ చేస్తున్న తేజ ఈసారి కొత్త కథ ఆల్రెడీ స్టార్స్ గా ఉన్న కాస్టింగ్ తో ఎలాంటి సినిమా తీస్తాడో మరి.

సినిమా కాంబినేషన్ అయితే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నా.. తేజ ఆ అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. బాహుబలి-2, ఘాజి సినిమాలు ముగించుకుని తేజ సినిమాలో నటించేందుకు రెడీ అవబోతున్నాడు రానా.     

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -