Sunday, May 12, 2024
- Advertisement -

వివాదం : ముస్లిం తరహా లో హిందూ మంత్రి ఇరాన్ లో

- Advertisement -

ఇరాన్ పర్యటన లో బిజీ గా ఉన్న భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆ దెస అధ్యక్షుడు రౌహనీ తో భేటీ సందర్భంగా తలనిండా వస్త్రం కప్పుకుని కనపడ్డం సోషల్ మీడియా లో చర్చనీయాంశం అయింది. ఆ సమావేశం లో ఆమె ముస్లిం మహిళల తరహా లో తలని వస్త్రం తో కప్పుకుని కనపడ్డారు దీనికి సంభందించిన అనేక ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

దీంతో ఈ వ్యవహారం సీరియస్ అవుతూ ఒస్తోంది. కొందరు ట్విట్టర్ , ఫేస్ బుక్ నెటిజెన్ లు ఆమె హిందూ అయ్యి ఉండి ఇలా చెయ్యడం బాలేదు అంటున్నారు. హిందూ సాంప్రదాయబద్ధంగా తలపై కప్పుకుని ఉంటే బాగుండేదని చెబుతూనే..

ముస్లిం మహిళల తరహాలో సుష్మా వేషధారణ ధరించడం చాలా హాస్యాస్పదంగా ఉందని, విదేశాంగ శాఖ దేశానికి, దేశ సంప్రదాయానికి ప్రాతినిధ్యం వహించాలి కానీ, ఇలా ఈ ఇరాన్ లుక్ ఎందుకని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా భారత ఇంధన అవసరాల విషయంలో ఇరాన్ ను సంతృప్తిపరిచేందుకే మంత్రి సుష్మా ఆ దేశ వేషధారణలో కనిపించారని విమర్శించడం గమనార్హం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -