Wednesday, May 15, 2024
- Advertisement -

‘డిక్టేటర్’ పై నిస్సహాయ స్ధితిలో తమన్…!

- Advertisement -

అతి తక్కువ కాలం లో యాభై చిత్రాలకు పైగా మ్యూజిక్ ను అందించడమే కాకుండా, వాటిలో కూడా స్టార్ హీరోలకు సైతం తన సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్. తాజాగా రాబోతున్న బాలకృష్ణ 99 వ చిత్రం డిక్టేటర్ కు ఆయన సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ, తమన్ ప్రస్తుతం నిస్సహాయ స్ధితిలో ఉన్నాడట.

చెన్నైలో వచ్చిన వరదల కారణంగా, తమన్ డిక్టేటర్ రీరికార్డింగ్ పనుల్లో పాల్గొనలేక పోతున్నాడని సమాచారం. దీంతో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో పలు బాలయ్య చిత్రాలకు మణిశర్మ మ్యూజిక్ ను అందించారు.

కాగా ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్ర ఆడియోను అమరావతి వేదికగా ఈ నెల 20 విడుదల చేయనుండగా, సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ సరసన అంజలి, సొనాలి చౌహాన్ లు హీరోయిన్ లుగా నటించారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -