Friday, May 17, 2024
- Advertisement -

ఇప్పుడు అభిమానుల కోరక ఇదే!

- Advertisement -

భారీ అంచనాలతో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆశించిన విజయం సొంతం చేసుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత పవన్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అలాగే మరో మెగా హీరో రామ్ చరణ్ బ్రూస్ లీ ప్లాప్ తర్వాత ఎలాగైన సూపర్ హిట్ కొట్టాలి అని తమిళంలో సూపర్ హిట్ అయిన తనీ ఓరువన్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

ఈ చిత్రాన్నికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే మెగా అభిమానులు తమ హీరో మరో మెగా హీరో సినిమాలో నటిస్తే అద్భుతంగా ఉంటుందని ఆశపడుతుంటారు. మెగా స్టార్ చిరంజివి శంకర్ దాదా ఎంబిబిఎస్ శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించి అభిమానులను అలరించాడు. మెగాస్టార్ రామ్ చరణ్ మగధీర, బ్రూస్ లీ చిత్రంలో కనిపించి అభిమానులను అలరించాడు. చిరు సినిమాలో పవన్, రామ్ చరణ్ సినిమాలో మెగాస్టార్ కనిపించారు.

కానీ పవన్ సినిమాలో రామ్ చరణ్ కానీ రామ్ చరణ్ సినిమాలో పవన్ కానీ కనిపించలేదు. అభిమానులు ఇప్పుడు పవన్ సినిమాలో రామ్ చరణ్ కానీ రామ్ చరణ్ సినిమాలో పవన్ కాని కనిపిస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. గతంలో పవన్ రామ్ చరణ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అది ఎప్పుడు నిజం అవుతుందో చూడాలి. మరి అభిమానులు కోరుకున్నట్లు ఒక పవన్ సినిమాలో చెర్రీ కనిపిస్తాడో లేక చెర్రీ సినిమాలో పవన్ కనిపిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -