తెలుగు సినీ పరిశ్రమ సినిమా రేంజ్ చాలానే పెరిగింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా అంటే ఏంటో ప్రపంచాన్నికి అర్ధం అయింది. తెలుగు సినిమా రోజు రోజుకు అబివృద్ధి చెందుతుంది. ఐతే ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలందరు సినిమాలకు భారీగా బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారు. మన టాప్ హీరోలు కూడా అదే రేంజ్ లే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
ఐతే ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలందరు రూ. 10 కోట్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఎవరూ తీసుకోవడం లేదట. రెమ్యునరేషనే కాకుండా ఇటు శాటిలైట్ రైట్స్ లేకపోతే, లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారట. ఐతే మన టాప్ హీరోలందరి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. తెలుగుతో పాటు తమిళనాడు, కర్ణాట, కేరళలో కొందరు తెలుగు స్టార్ల సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.
బాలీవుడ్లోనూ కొన్ని సినిమాలు అనువాదం అవుతుంటాయి. తమ మార్కేట్‍ను బట్టి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఐతే సినీ పరిశ్రమలో వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఐతే పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు రూ. 22 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
జూ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రూ. 20 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్. మహేష్ బాబు ఒక సినిమాకు రూ. 20 కోట్ల మరియు లాభాల్లో వాట కూడా తీసుకుంటున్నట్లు టాక్. రామ్ చరణ్ ఒక్కో సినిమాకు రూ. 17 కోట్ల వరకు తీసకుంటున్నాడట. అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు రూ. 13 నుండి 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 18 కోట్లు తీసుకుంటున్నాడట.
