Monday, May 6, 2024
- Advertisement -

ఏ అమ్మాయి అయినా తనను పెళ్లి చేసుకుంటుందా?

- Advertisement -

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే దగ్గుబాటి రానా పేరు చెప్పొచ్చు. అలాంటి రానా పెళ్లిపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాల్లోని క్యారెక్టర్లను చూసిన తర్వాత ఏ అమ్మాయి అయినా  తనను పెళ్లి చేసుకుంటుందా? అని ప్రశ్నించారు. తన నెక్స్ట్ మూవీ బాహుబలి 2 లో తాను పోషించిన విలన్ పాత్రను చూశాక ఏ ఆడపిల్ల తనను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదేమోనని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

బెంగళూర్ నాటకాల్ మూవీలో నటిస్తున్న రానా ఈ సినిమా ప్రమోషనల్ భాగంగా  మీడియాతో మాట్లాడుతూ  ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను ప్రస్తుతం చాలా సినిమాలకు సైన్ చేశాననీ, కమిట్ అయిన సినిమాలన్నిటినీ పూర్తి చేశాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని తేల్చిచెప్పాడు. అయితే తాను పోషిస్తున్న విలన్ పాత్రలను చూస్తే ఎవరికైనా ప్రేమ పుడుతుందా అంటూ కామెంట్ చేశాడు. బాహుబలి  రెండవ భాగంలో తాను చాలా క్రూరంగా కనిపించబోతున్నానని పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -