దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి ఇతని డైరెక్షన్‍లో వచ్చిన దేవదాస్ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. రిసేంట్ గా మెగా మేనల్లుడు సాయు ధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తు స్టార్ట్ చేసిన సినిమా రేయ్. కానీ ఈ సినిమా రిలీజ్ చాలా లేట్ అయ్యి ధరమ్ తేజ్ రెండో సినిమాగా రిలీజ్ అయింది.
రిలీజ్ అయిన లాభం లేకపోయింది. రిలీజ్ అయిన మొదటి రోజే ప్లాప్ అని తెలిపోయింది. అప్పటికే ఆర్థికగా దెబ్బతిన్న చౌదరి గుడివాడలోని తన ‘బొమ్మరిల్లు’ థియేటర్ ను తాకట్టు పెట్టి ఆంధ్రాబ్యాంక్ లో లోన్ తీసుకున్నారు. చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో రుణం చెల్లించలేకపోయాడు.
ఇక లాభం లేదు అని ఆంధ్రా బ్యాంక్ అధికారులు గురువారం ధియేటర్ సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. వరస ప్లాపుల వైవిఎస్ చౌదరిని అర్ధికంగా బాగా దెబ్బతీసాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన రేయ్ చిత్రాల చౌదరిని ఆర్థికంగా ముంచేసింది.
