Friday, May 17, 2024
- Advertisement -

హీరోల మీటింగ్‌ పదనిసలు… యువ హీరోకి బడా హీరో క్లాస్

- Advertisement -

ఆ యువ హీరో ఖాతాలో పెద్దగా హిట్స్ లేవు. టాలీవుడ్ బడా బడా వంశాలకు చెందినవాడు కూడా కాదు. కానీ ఆయనగారి తండ్రి కూడా సినిమా ఇండస్ట్రీలో ముప్ఫై ఏళ్ళుగా మేనేజ్‌మెంట్ వ్యవహారాలు చూస్తున్నవాడే. టాలీవుడ్‌ని డామినేట్ చేసే కులబలం మాత్రం దండిగా ఉంది. ముఖ్యనేత కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక మనవాడు కంట్రోల్ అవుతాడు. ఆ ముఖ్యనేత బంధువైన హీరోతో కూడా మనవాడికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అందుకే రెచ్చిపోతూ ఉంటాడు.

ఒక టాలెంటెడ్ యాక్ట్రెస్‌ని తీవ్రంగా అవమానించాడు. కాస్త వ్యక్తిత్వం గల ఆ అమ్మాయి మనవాడి ఏషాలకు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పడంతో మనవాడి హీరోయిజం ఇగో దెబ్బతిందన్నది టాలీవుడ్ పుకారు. తాజాగా హీరోల మీటింగ్‌లో కూడా లేని పెద్దరికం తీసుకుని ఏదో ఎక్స్‌ట్రాలు చేయబోయాడట. కుల మీడియాకు సపోర్ట్‌గా మాట్లాడే ప్రయత్నంలో మీడియా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద మాటలు ఏవో మాట్లాడేశాడట. వెంటనే ఆ పక్కనే ఉన్న ఒక హీరోకి చిర్రెత్తుకొచ్చిందట. ఆ యువ హీరోని తన పక్కన కూర్చోబెట్టుకుని గట్టిగానే క్లాస్ పీకాడట. నీతో యాక్ట్ చేసిన హీరోయిన్స్‌ని టార్చర్ పెట్టడం, నువ్వు యాక్ట్ చేసిన సినిమాను, నీపైన పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్స్‌ని అవమానించడం….. గట్టిగా రెండు మూడు హిట్స్ కూడా లేని నీకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? ముఫ్పై ఏళ్ళ నుంచీ సినిమా వాళ్ళతో మీడియా ఎలా ఉందో మేం చూడడం లేదా? కుల గౌరవం నిలబెట్టడానికి వచ్చిన పెద్దమనిషివా నువ్వేమైనా? ముందు హీరోగా నిలబడడానికి ట్రై చెయ్…… ఆ తర్వాత ఇండస్ట్రీకి సుద్దులు చెప్దువుగానీ అని ఆ హీరోకి క్లాస్ పీకాడట ఆ బడా హీరో. ఇక పైన అయినా సదరు హీరోగారి హీరో తాంత్రమ్స్‌లో మార్పు వస్తుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -