Friday, May 10, 2024
- Advertisement -

యంగ్ హీరోతో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్..?

- Advertisement -

ఆమె ఓ పెద్ద కథనాయిక.. దశాబ్దానికి పైగా సినిమాల్లో కొనసాగుతోంది. అతనో స్టార్ హీరో. చేతినిండా.. సినిమాలు ఉన్నప్పటికి కెరీర్ ను మంచి దారిలో పెట్టుకోలేకపోయాడు ఆ యంగ్ హీరో. మాములుగా మూవీస్ లో మినహాయిస్తే.. ఇలాంటి కాంబినేషన్ ఎక్కడా సెట్ కాదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తున్న హాట్ ఎఫైర్ ఇదే అంటున్నారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆ హీరోయిన్.. ఈ మధ్యనే ఓ సీనియర్ హీరోతో భారీ సక్సెస్ అందుకుంది. మంచి ఫాంలో ఉన్న ఆమెకు కోలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. అమ్మడి టైమ్స్ మళ్లీ మొదలైనట్లే అంటున్నారు. కానీ ఆ యంగ్ హీరో పరిస్థితి వేరు.. స్టార్టింగ్ లో వచ్చిన పేరును ఉపయోగించుకోలేక.. తెలుగులో హిట్ కొట్టలేకపోయి.. తమిళ్ లో ఓ విజయం సాధించి.. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరూ ఇప్పటివరకూ ఒక్క సినిమాలో కూడా కలిసి కనిపించలేదు కానీ.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం తెగ చక్కర్లు కొట్టేస్తున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ మధ్య ఆ యంగ్ హీరోతో కలిసి ప్రైవేటుగా ఓ హాలీడే ట్రిప్ కూడా వేసిందట ఈ స్టార్ బ్యూటీ. పార్టీలు.. ఫంక్షన్స్ లో అడపా దడపా కలిసిన పరిచయం.. చివరకు చాలా దూరం వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ ఆఫ్ స్క్రీన్ కాంబోపై ఇండస్ట్రీలో రకరకాల కామెంట్స్ వినిపిస్తుంటే.. ఆ హీరోయిన్ తల్లి మాత్రం ఈ కుర్రాడితో తన కూతురు అడ్వాన్స్ అవుతుండడంపై తెగ బెంగ పెట్టేసుకుంటున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -