Monday, April 29, 2024
- Advertisement -

హీరోగా మారిన విలన్‌!

- Advertisement -

టాలీవుడ్‌లో ఎందరో హీరోలు విలన్లుగా మారగా, విలన్‌లు హీరోలుగా మారారు. ఇప్పుడు అదే కోవలో మరో హీరో రాబోతున్నాడు. పుష్ప విలన్‌ అజయ్ ఘోష్‌ హీరోగా సినిమా రాబోతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ షాప్ మూర్తి అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ఈ మేరకు సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట‌ర్‌లో రెండు గెట‌ప్‌ల‌లో అజ‌య్ ఘోష్ ఆకట్టుకున్నారు. ఓ గెట‌ప్‌లో స్కూట‌ర్ రైడ్ చేస్తూ మిడిల్ ఏజ్ వ్య‌క్తిగా,మ‌రో గెట‌ప్‌లో క్యాప్, క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి మెడ‌లో హెడ్‌ఫోన్స్‌తో స్టైలిష్‌గా కనిపించారు.

ఇక ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు అజయ్ ఘోష్. క‌ల‌ర్ ఫొటో ఫేమ్ చాందిని చౌద‌రి కీల‌క పాత్ర పోషిస్తోంది. మ్యూజిక్ షాప్ మూర్తి షూటింగ్ పూర్త‌యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌నున్నారు.

ప్ర‌స్థానం సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు అజ‌య్ ఘోష్. తర్వాత రంగస్థలం,గుంటూరు కారం, వీరసింహారెడ్డి,పుష్ప సినిమాల్లో నటించి మెప్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -