Saturday, May 25, 2024
- Advertisement -

పవర్ స్టార్‍కి పోటీగా సూపర్ స్టార్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నాడు అక్కడ నుండి రాగానే ఈ సినిమా షూటింగ్‍లో పాల్గొనబోతున్నాడు. హైదరాబాద్‍లో వేసిన భారీ సెట్‍లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.

బాబీ దర్శకత్వంలో భారీ బడ్జేట్‍తో ఈ సినిమా తెరకేక్కుతుంది. మొదటి సారిగా పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాని ఈ సమ్మర్‍ ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల కానుంది. ఇక పవన్‍కి పోటిగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకేక్కుతున్న కబలి సినిమా తెలుగు తమిళ భాషల్లో ఈ సమ్మర్‍లో నే విడుదల కానుంది.

కబలిలో రజనీ లుక్‍కి అద్భుతమైన స్పందన వస్తుంది. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కలైపులి ఎస్.దాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటు సర్దార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే రజనీ కబలి సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలవడంతో ఏ స్టార్ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -