కళాశాల జీవితం మధురమైనది.. అద్భుతమైనది. సరదాలు.. సంతోషాల నడుమ జరిగే ఆ కళాశాల లైఫ్ అంటే అందరికీ ఇష్టమే. ఆ కాలాన్ని మన జీవితంలో పదిలంగా నిలుచుకుంటాం. ఆ సమయంలో జరిగిన ఘటనలు గుర్తుతెచ్చుకుంటే మన మోముపై ఒక ఆనందం.. భావోద్వేగం వస్తుంది. ఇప్పుడు అలాంటిదే ఓ హీరో ఎదుర్కొన్నాడు.
అయితే కళాశాల జీవితంలో సీనియర్స్, జూనియర్స్ ఉండడం సాధారణమే. వారి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇప్పుడైతే ర్యాగింగ్ నియంత్రణ చట్టం వచ్చింది. కానీ ఒకప్పుడు ఇవి తారస్థాయి చేరుకొని ప్రాణాలు పోయేంత స్థితికి ఉండేవి. ఇప్పుడు అలాంటివి లేకున్నా సరదా సరదాగా జరుగుతున్నాయి. అలాంటి పరిణామాన్ని కుర్ర నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని కిర్రాక్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పంచుకున్నాడు.
నిఖిత్ ఇంజినీరింగ్ చదివాడు. అతడు చదివే రోజుల్లో కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ మధ్య విబేధాలు ఉండేది. గొడవలు జరుగుతుండేవంట. ఆ సమయంలో సీనియర్స్, జూనియర్స్ మధ్య ఇగో సమస్యలు తలెత్తి గొడవలు పడ్డారంట. అలా కళాశాలలో ఓసారి జరిగిన గొడవలో ఏకంగా పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లొచ్చాడు నిఖిల్. అయితే ఆ పాటికి నిఖిల్ సినీ పరిశ్రమకు పరిచయం కాలేదు. కానీ ఆ సమయంలో పోలీసులు ఏదో కుర్రాళ్ల వ్యవహారం అని చెప్పి లైట్ తీస్కొని వదిలేశారు. ఈ విధంగా నిఖిల్ కళాశాల లైఫ్‌ను ఎంజాయ్ చేశాడు.