అందాల తార త్రిష రూట్ మార్చింది. వరుసగా గ్లామర్ హీరోయిన్ క్యారెక్టర్లు చేసిచేసి.. ఆమెకు బోర్ కొట్టిందట. ఇకపై.. చేసే క్యారెక్టర్లన్న యాక్టింగ్ కు స్కోప్ ఉన్నవే ఎంచుకుంటానని ఈ చెన్నై సుందరి చెబుతోంది. అందుకు తగ్గట్టే.. త్వరలో నాయకి సినిమాలో టాప్ టు బాటమ్.. ఆఖరికి తనకు ఎంతో ఇష్టమైన టాటూ కూడా కనిపించకుండా బట్టలు వేసుకుంటోందట.
టూ మచ్ గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉండడమే కాదు.. ఇకపై ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర కావాలన్నదే తన టార్గెట్ గా చెబుతున్న త్రిష.. కొత్త సినిమా నాయకి నుంచే తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. తెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కనున్న ఈ సినిమాలో.. అప్పటి హీరోయిన్లు వాణిశ్రీ, కాంచన మాదిరిగా.. డిఫరెంట్ లుక్ లో కనిపించేలా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇది విన్న త్రిష ఫ్యాన్స్ కాస్త ఫీలవుతున్నారట. ఇన్నాళ్లూ త్రిష అందాలను ఆస్వాదించిన తాము.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కాకుండా ఎలా చూడగలమని అంటున్నారట. అంతే కాక.. ఈ విషయంలో త్రిష మళ్లీ ఆలోచించుకోవాలని కూడా కోరుతున్నారట.