Friday, May 3, 2024
- Advertisement -

చైతు, సమంతకు పెళ్లి పవన్, త్రివిక్రం ఇచ్చిన గిఫ్ట్ ఇదే

- Advertisement -

నాగ చైతన్య, సమంత పెళ్లి తాజాగా జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబల మధ్య చైతు, సమంత ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వెడుకలో బందువులు స్నేహితులు చాలా ఉత్సాహంగా డాన్స్‌లు.. హంగామా సృష్టించారు. మిత్రులు, బంధువులు ఎవరికి తోచిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఈ కొత్త జంటకు ఇచ్చారు. అయితే అక్కినేని మరియు దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఓ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ గా ఈ వీడియో తయరు చేసి సమంతకు ఇచ్చారు.

ఆ వీడియో చూసి సమంత ఆనందంతో కన్నీరు పెట్టుకుందని చెబుతున్నారు. ఇక సమంత పెళ్లి పవన్‌ కళ్యాణ్‌ మరియు త్రివిక్రమ్‌లు కలిసి ఒక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ తో సమంత అత్తారింటికి దారేది సినిమాలో నటించింది. అలానే సమంతకు.. త్రివిక్రమ్ తో కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వరుసగా ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అఆ’ చిత్రాల్లో సమంత నటించింది. ఈ మూడు సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. అందుకే పవన్‌ కళ్యాణ్‌ మరియు త్రివిక్రమ్‌లకు సమంత చాలా సన్నిహితురాలు అయ్యింది. ఆ కారణంగానే సమంత వివాహానికి ప్రత్యేకమైన గిఫ్ట్‌ ఇవ్వాలని భావించిన త్రివిక్రమ్‌ ప్రత్యేకంగా తయారు చేయించిన కపుల్‌ డైమండ్‌ రింగ్స్‌ను బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

పవన్‌, త్రివిక్రమ్‌లు ఇచ్చిన గిఫ్ట్‌కు సమంత చాలా సంతోషం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్‌లో జరగబోతున్న సమంత, నాగచైతన్యల పెళ్లి రిసెప్షన్‌కు కూడా పవన్‌, త్రివిక్రమ్‌లు హాజరు కానున్నారు. ఆ రిసెప్షన్‌కు టాలీవుడ్‌ ప్రముఖులు మరియు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు దాదాపు అంతా కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -