Saturday, April 27, 2024
- Advertisement -

స్క్రీన్ లో కామెడి.. బయట విలనిజం…

- Advertisement -

హాస్యనటుడు.. ఆల్ ఇండియా అందగాడు బాబు మోహన్ టిఆర్ ఎస్ నుంచి ఎమ్ ఎల్ ఏ గా ఎన్నికైన దగ్గరనుంచి ఎవ్వరి మాట అస్సలు వినడం లేదు.తన నియోజకవర్గంలో తిరుగుతూ సరికొత్త విలనిజాన్ని చూపిస్తున్నారు. మన టీడీపీ నుంచి వచ్చిన ఈ సారులో ఇలాంటి వేషం కూడా ఉందా అని అంతా గుసగుసలు ఆడుకుంటున్నారు. తాజాగా తన నియోజకవర్గంలో పర్యటించిన బాబూ గారు… ఓ స్థానికుడిపై అసభ్య పదజాలంతో విరుచుకు పడ్డారు.

కేసీఆర్ కట్టిస్తానని చెప్పిన డబుల్ బెడ్రూంల గురించి ప్రస్తావన తెచ్చిన స్థానికుడితో.. ‘నువ్వు ఇక్కడ ఉండొద్దు.. కడుపు కాగానే పిల్ల పుట్టదు.. 9 నెలలు ఆగాకే పిల్ల పుట్టుద్దంటూ… బూతుపురాణం అందుకున్నారు. స్థాయికి తగ్గట్టు మాట్లాడు.. గెట్ అవుట్. కంటికి కనపడొద్దు. వాడు కనపడితే లోపలేసి పడదొబ్బండి..’ అంటూ రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేశారు. ఈ సీన్ ని అక్కడ కొందరు కుర్రాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అయిపోయింది. 2014 ఎన్నికలకు ముందు వరకు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన బాబూ మోహన్, తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి, మెదక్ జిల్లా ఆంధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి మనందరికీ తెలిసిందే.

మరి ఈ విలనిజం టీడీపిలో ఉండగా అంటుకుందా లేక టీఆర్ ఎస్ లోకి వచ్చాక అలవడిందా అని రానున్న రోజులలో తేలిపోనుంది. ఇప్పటికే ఈవిషయంపై కేటీఆర్ గుర్రుగా ఉన్నాడని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -