- Advertisement -

పవన్ కళ్యాణ్ సినిమాలో ఉదయభాను..?

- Advertisement -

పవన్ కళ్యాణ్ సినిమా రావడం కాస్తా లేటు అయినప్పటికి.. పర్ఫెక్ట్ గానే రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వచ్చే ఏడాది పొంగల్ కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చాలానే సర్ ఫ్రైజులను ఆడియన్స్ కు ఇవ్వబోతున్నాడట ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజాగా.. తివిక్రమ్ తో ఉదయభాను కాసేపు మీటింగ్ కావడం పై కొత్త పుకార్లు వస్తున్నాయి. పవన్-త్రివిక్రమ్ మూవీలో ఉదయభానుతో ఓ ఐటెం సాంగ్ చేయించే.. ఛాన్సులపై చర్చలు జరిగాయని అంటున్నారు.

ఈ మధ్య యాంకర్లతో ఐటం సాంగ్స్ చేయంచే కల్చర్ కూడా ఇప్పుడు నడుస్తోంది. పైగా యాంకర్ ఉదయభాను ఈ మధ్య మళ్లీ తన యాంకరింగ్ ను మొదలు పెట్టింది. ఓ డ్యాన్స్ ప్రోగ్రాంకు యాంకర్ గా ప్రస్తుతం చేస్తోంది. ఇక ఇటివలే బతుకమ్మ సాంగ్ లో కూడా ఉదయభానునే స్పేషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇలాంటి సమయంలో ఉదయభానుతో ఐటెం సాంగ్ చేయిస్తే.. అది కచ్చితంగా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇదే విషయంపై ఈ యాంకర్ సరే అనేసిందనే వార్త వినిపిస్తోంది. గతంలో కూడా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే రూపొందిన జులాయి మూవీలో ఐటెం సాంగ్ చేసిన అనుభవం ఉండడంతో.. ఇప్పుడు కూడా ఒప్పేసుకుందని అంటున్నారు.

అయితే ఉదయ భాను ఐటం సాంగ్ దాదాపు ఖాయమే అయినప్పటికి.. అధికారికంగా దర్శకుడు ఇంకా బయటకు చెప్పలేదు. అయితే ఉదయభాను యాంకర్ గా చేస్తున్న.. నీతోనే డాన్స్ ప్రోగ్రాంకు జడ్జ్ గా రేణు దేశాయ్ చేస్తున్నారు. అయితే పవన్ సినిమాలో ఐటం సాంగ్ ను ఉదయభానును రేణు చేయమని చెప్పిందట. అందుకే ఉదయభాను త్రివిక్రమ్ ను కలిసింది. సో ఈ విషయంలో క్లారిటీ వచ్చే వరకు కాస్తా వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -