సంచిన్ జోషి.. ఇతని పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. అసలు సచిన్ జోషి ఎవరు.. ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడో ఇప్పుడు చూద్దాం.. జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జగదీశ జోషి తనయుడు సచిన్ జోషి. కింగ్ ఫిషర్ దివాళా తీస్తున్న తైంలో ఆ సంస్థను కొని.. సంచలనం సృష్టించాడు.
బిజినెస్, సినిమాలు, మీటింగ్.. ఇలా సమయం లేకుండా గడిపేస్తుంటాడు సచిన్ జోషి. అయితే ఆయనకు కాస్తా టైం దొరికితే.. ఎవరు చేయాని విధంగా ఎంజాయ్ చేస్తూ.. జీవితాన్ని గడుపుతుంటాడు. బిజినెస్ స్ట్రెస్ నుంచి కాస్త రిలీఫ్ కోసమే సినిమాల్లో నటిస్తాను అని చెప్పే సచిన్ జోషి ఇంకా అంతకన్నా ఎక్కువగానే ఫ్రీ టైం ను ఇంకా ఎంజాయ్ గా గడిపేస్తుంటారట. ఇక ఆయన సినిమాల్లో హీరోగా చేసే విషయానికి వస్తే..హిట్, ఫ్లాప్ అనే అంశంతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. మరి ఆయన దగ్గర డబ్బు చాలా ఉంది. అయితే క్రేజ్ మాత్రం తక్కువ ఈ హీరోకి. ఈయనకే కాదు.. వేల కోట్ల ఆస్తి పరులందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. అందుకే ఈ హీరో డబ్బుతో పాపులారిటీ తెచ్చుకునేందుకు బానే కష్టపడుతున్నాడు. హాస్పిటాలిటీ నుండి హౌసింగ్ వరకు ఫిట్నెస్ సెంటర్స్ నుండి హెల్త్ స్పా ల వరకు సచిన్ జోషికి లేని క్రేజీ బిజినెస్ లేదు. అందుకే ఆయనొక మల్టీ బిజినెస్ మెన్. టాలీవుడ్ లోని అందరి హీరోలకంటే ఎక్కువ ఆస్తులని కలిగివున్న వ్యక్తి. టిఫిన్ చేయడానికి లండన్ వెళ్తాడు లంచ్ చేయడానికి ఫ్యారిస్ వెళ్తాడు. ఇక ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు.
ఇక సచిన్ జోషి.. నటి, మోడల్ అయిన ఊర్వశి శర్మ ను పెళ్లి చెసుకున్నారు. ఇక మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చిన అది ఖచ్చితంగా సచిన్ జోషి ఇంట్లోకి రావాల్సిందే. కోట్ల రూపాయల విలువ చేసే కార్లు, బడా బంగ్లాలు, విల్లాలు, విందులు, వినోదాలు, సరదాగా సినిమాలు.. ఇవన్నీ చేస్తూనే తన ప్రొఫెషన్ ని సైతం నిర్లక్ష్యం చేయకుండా టాప్ బిలియనీర్ల జాబితాలో ప్రముఖ స్థానంలో ఉన్నాడు సచిన్ జోషి.