Monday, May 13, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి.. 5 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడో తెలుసా..?

- Advertisement -

నాని హీరోగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్ లో వచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రను పోషించి మంచి ప్రశంసలు అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో మంచి నటన కనబర్చినందుకు విజయ కి ‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరోగా నటించే అవకాశం దక్కింది.

ఆ సినిమా ఎవరు ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న క్రమంలో ఓవర్ నైట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇక రీసెంట్ గా ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరోల స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం స్టార్ అయిన విజయ్‌ దేవరకొండ అయిదు సంవత్సరాల క్రితం ఏం చేశాడో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేని విజయ్‌ దేవరకొండకు సినిమాల్లో నటించాలనే కోరిక. ఆ కోరికతోనే యాక్టింగ్‌ నేర్చుకున్నాడు. శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో చిన్న పిల్లలకు యాక్టింగ్ నేర్పించేవాడు. స్కూల్స్‌లో వేసే డ్రామా కోసం పిల్లలను సిద్దం చేసేవాడు.

2012లో తాను స్కూల్‌ పిల్లలకు యాక్టింగ్‌ టీచర్‌ అంటూ విజయ్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. ఇంతలో ఎంత మార్పు చూడండి. ఇప్పుడు స్టార్‌ హీరో, ఆయన వద్ద పెద్ద నిర్మాతలు మరియు దర్శకులు క్యూ కట్టారు. ఇక ప్రస్తుతం విజయ్ పరుశురామ్ డైరెక్షన్ లో అల్లు అరవింద్ నిర్మించే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -