Tuesday, April 30, 2024
- Advertisement -

టీడీపీ నుంచి ఎంపీ సీటు ఆఫ‌ర్ …

- Advertisement -

రాష్ట్రంలో రాజ‌కీయాల‌లో వేగంగా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికె వైసీపీ నుంచి టీడీపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు వెల్లేందుకు రెడీగా ఉన్నార‌ని వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. ఇప్పుడు తాజాగా మ‌రో షాకింగ్ వార్త వెలుగులోకి వ‌చ్చింది. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత వీర విధేయుడుగా ఉన్న మాజీ ఎంపీ ఒక‌రు అధికార పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌నుంచి విడిపోయి వైసీపీ పార్టీని పెట్టిన త‌ర్వాత కూడా జ‌గ‌న్‌కు మాజీ ఎంపీ బ‌హిరంగంగానె స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న కాంగ్రెస్ త‌ర్వాత సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్‌కు భ‌విష్య‌త్తులేక‌పోవ‌డంతో పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2009లో నాటి సీఎం త‌న ప్రియ శిష్యుడు అయిన ఆయ‌న‌కు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ టిక్కెట్ ఇప్పించుకోవ‌డ‌మే కాకుండా ఆర్థిక సాయం చేసి కూడా గెలిపించుకున్నారు. అలాంటి వీరాభిమాని సైకిల్ పార్టీ ఎక్క‌నున్న‌ర‌నె వార్త‌లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.

జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా తెర‌వెన‌కనుండి స‌ల‌హాలు ఇచ్చినా జ‌గ‌న్ తీరు న‌చ్చ‌క‌పోవ‌డంతో కొన్ని సార్లు జ‌గ‌న్‌ను హెచ్చ‌రించార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయాల‌నుకున్నా జ‌గ‌న్ తీరుపై సందేహంతో ఆయ‌న సైలెంట్‌గా ఉండిపోయారు. క్లీన్ ఇమేజ్ ఉన్న ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీలోకే వెళ‌తార‌ని వార్త‌లు వ‌చ్చినా హ‌రి మాత్రం జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు సుత‌రాము ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌.

ఆయ‌న ఎవ‌రో కాదు మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి. కొద్ది రోజుల క్రితం టీడీపీలోని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు కూడా హ‌రిని క‌లిసి పార్టీలోకి ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న పార్టీలో చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన‌కాపల్లి ఎంపీ సీటు ఇస్తామ‌ని కూడా టీడీపీ అధిష్టానం నుంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకె ఇప్పుడు బాబుకు స‌పోర్ట్‌గా వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్టు కూడా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -