Saturday, April 27, 2024
- Advertisement -

టాలీవుడ్ 100 కోట్ల సినిమా.. అక్కడ మాత్రం అట్టర్ ప్లాప్!

- Advertisement -

టాలీవుడ్ యువ దర్శకుడు బుచ్చిబాబు మెగా హీరో వైష్ణవ్ తేజ్‏ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన మొదటి సినిమా “ఉప్పెన”. ఈ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. టాలీవుడ్ లో ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది.

ఉప్పెన మూవీ శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానెల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఈ నెల18వ తేదీన బుల్లితెర పై ప్రసారం కాగా ఈ సినిమాకు టీఆర్పీ రేటింగ్ ఆశించినంత రాలేదని తెలుస్తోంది. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఉప్పెన సినిమా బుల్లితెరపై అనుకున్నంత టీఆర్పీ రేటింగ్ సాధించలేకపోవడంతో మెగా అభిమానులను నిరాశ పరిచింది. సాధారణంగా థియేటర్లలో విజయం సాధించిన సినిమాలు బుల్లితెరపై ఆదరణ దక్కుతుంది.

హీరో వైష్ణవ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‏గా తొలి పరిచయంలోనే అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా అద్భుతంగా నటించి ఈ సినిమాకు మరింత ఇమేజ్ ను పెంచాడు.

వెంకటేష్ కు ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా ?

టాలీవుడ్ స్టోరీస్.. ఇక్కడ అన్ని జోనర్ల కథలు అమ్మబడును…..?

మెగాస్టార్ వాడే కార్లు ఇవే.. వాటి ధర ఎంతంటే ?

సొంత విమనాలు ఉన్న హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -