రెండు రోజుల్లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ITC Hotels వీరి వివాహం జరగనుండగా ఈ ఘన వేడుకకు పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు.
ఇప్పటికే దర్శకుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వారితో పాటు స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా ఉన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివాహానికి కేవలం 100 మంది అతిథులకే ఆహ్వానం అందిందని సమాచారం. విజయ్‌కు సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు సందీప్ వంగా సహా మరికొందరు ప్రముఖులు ఆహ్వానితుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
2026 ఫిబ్రవరి 26న సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అలాగే, ఇతర సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో 2026 మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం.
