Monday, April 29, 2024
- Advertisement -

కొత్త డైరెక్టర్ తో వైష్ణవ తేజ్ సినిమా.. పాత్ర ఏంటంటే?

- Advertisement -

“ఉప్పెన” సినిమా ద్వారా మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరో హీరో
సాయి ధరన్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మెగా హీరోకి ఉప్పెన సినిమా తరువాత వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మొదటి సినిమా విజయవంతం కావడంతో పలువురు నిర్మాతలు వైష్ణవ్ తేజ్ ను హీరోగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా లో నటిస్తున్నాడు. అలాగే బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మాతగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నిర్మాతగా చేయనున్న సినిమాకు వైష్ణవ్ తేజ్ ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా పృథ్వి అనే కొత్త డైరెక్టర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

Also read:సమంత, నాగచైతన్య కాంబోలో సినిమా.. ఫ్యాన్స్ కు పండగే?

నాగార్జున నిర్మాతగా పృథ్వి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హాకీ క్రీడ నేపథ్యంలో రూపొందనుందట. ఇందులో వైష్ణవ్‌ తేజ్‌ హాకీ ప్లేయర్‌ పాత్ర చేయనున్నారని, హాకీ క్రీడాకారుని పాత్రలో వైష్ణవ్ తేజ్ అద్భుతంగా నటించడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో నాగార్జున బిజీగా ఉన్నట్లు సమాచారం నడుస్తోంది.

Also read:సమంత, నాగచైతన్య కాంబోలో సినిమా.. ఫ్యాన్స్ కు పండగే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -