Friday, March 29, 2024
- Advertisement -

సమంత, నాగచైతన్య కాంబోలో సినిమా.. ఫ్యాన్స్ కు పండగే?

- Advertisement -

టాలీవుడ్ మన్మధుడు,అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున డ్రీమ్ ప్రాజెక్టు ‘బంగార్రాజు’ సినిమాను కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇది వరకే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీ ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో మూవీకి సిక్వెల్ గా వస్తున్న ‘బంగార్రాజు’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న సినిమా షూటింగ్ ఈ ఏడాది కరోనా పరిస్థితులు కాస్త కుదుటపడ్డాక మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా బంగార్రాజు మూవీ గురించి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగార్రాజు సినిమాలో అక్కినేని నాగ చైతన్య నాగార్జున కొడుకుగా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని, చైతన్యకు జోడీగా సమంతా కూడా ఈ మూవీలో నటిస్తోందని ప్రచారం జోరుగా సాగుతోంది.”మనం “సినిమా తరువాత నాగార్జున, చైతన్య కలిసి నటిస్తున్న సినిమా కావడం విశేషం.

Also read:బుల్లితెరపై టాప్ 5 యాంకర్స్ వీళ్ళే!

తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా ముద్ర పడిన అక్కినేని నాగచైతన్య, సమంత ఈ సినిమాలో భార్యాభర్తలుగానే కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేశావె ‘సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. తరువాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి సినిమాల్లో నటించారు. మళ్లీ బంగార్రాజు మూవీలో చైతన్య సమంతతో రొమాన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.

Also read:టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన శ్రద్ధ శ్రీనాథ్.. నిజమేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -