వరలక్ష్మీ శరత్‌కుమార్..వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అగ్రహీరోల దగ్గరి నుండి చిన్న హీరోల వరకు సినిమా ఏదైన మంచి పాత్ర ఉంటే ఓకే చెప్పేందుకు వెనుకాడరు వరలక్ష్మీ. అందుకే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. రీసెంట్‌గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్‌లో కీరోల్ పోషించారు. సంక్రాంతి రేసులో విజేతగా నిలిచింది హనుమాన్. ఇక ఈ సినిమా హిట్‌తో ఇప్పటివరకు రెమ్యునరేషన్ పెంపుపై కాస్త ఆలోచిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు మనసు మార్చుకుంది.
ప్రస్తుతం సినిమాకు రూ.50 లక్షలు తీసుకుంటున్న వరలక్ష్మీ…ఇకపై కోటికి పైగా డిమాండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చిందట. ప్రస్తుతం నిర్మాతల పాలిట గొల్డెన్ లెగ్‌గా మారగా వరలక్ష్మీ తీసుకున్న నిర్ణయాన్ని నిర్మాతలు ఏ విధంగా రీసివ్ చేసుకుంటారో వేచిచూడాలి.
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది వరలక్ష్మీ. అందుకే ఏ పాత్ర అయినా నాకు నచ్చితేనే చేస్తాను లేదంటే నిర్మోహమాటంగా తిరస్కరిస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. నేను ఎంతమాత్రం ఆశించని పాత్రలు హైలైట్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది.