- Advertisement -

‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ నేప‌థ్యంలో వ‌ర్మ సినిమా

- Advertisement -

జీఎస్టీకి వ‌ర్మ కొత్త నిర్వ‌చ‌నం

వివాదాలు, త‌న‌దైన శైలిలో వాగ్భాణాలు వేయ‌డంలో వ‌ర్మ దిట్ట‌. కట్టె కొట్టె తెచ్చే మాదిరి కాకుండా కౌంట‌ర్ ఇస్తూనే ఇవ్వ‌న‌ట్టుగా వ‌ర్మ శైలి ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. జీఎస్టీ నేప‌థ్యంలో వ‌ర్మ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఎప్పటికప్పుడు విభిన్న నేపథ్యాలతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఇప్పుడు జీఎస్టీ నేప‌థ్యంలో ఓ కొత్త సినిమా తీస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. పైగా జీఎస్టీకి త‌న‌దైన శైలిలో నిర్వ‌చ‌ణం ఇచ్చాడు. జీఎస్టీ అంటే ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ అని చెబుతూ ఈ నేప‌థ్యంలో సినిమా తీయ‌నున్న‌ట్లు తెలిపారు. మియాతో ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ను తెరకెక్కించడం మర్చిపోలేని అనుభూతి అని చెప్పారు.

‘ఇది జీఎస్‌టీ పన్ను కాదు. జీఎస్‌టీ అంటే ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ అని పేర్కొన్నారు. సన్నీలియోన్‌ తర్వాత అంతటి పేరున్న మరో పోర్న్‌ స్టార్‌ మియాగా అభివ‌ర్ణించారు. విప్లవాత్మకమైన శృంగారతత్వం గురించి మియా చెప్పిన దానిని అల్లుకుంటూ ఈ సినిమాను తీశాం’ అని వర్మ ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఇంత‌కుముందు ఓ షార్ట్‌ఫిల్మ్ రూపొందించారు. నేను స‌న్నిలియోన్ అవుతాన‌ని దాని టైటిల్‌.

ఇప్పుడు వ‌ర్మ నాగార్జునతో క‌లిసి శివ‌కు సీక్వెల్ తీస్తున్నారు. వేసవిలో సినిమా వ‌చ్చేలా క‌నిపిస్తోంది. దీంతో పాటు క‌డ‌ప అనే ఇంట‌ర్నేష‌న‌ల్ వెబ్ సిరీస్ చేస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -