వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

Varun Tej and Lavanya Tripathi to get engaged in June..?
Varun Tej and Lavanya Tripathi to get engaged in June..?

‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’చిత్రాల్లో నటించిన వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిల జోడీ మెప్పించింది. ఆ రెండు చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వివాహం కూడా చేసుకోనున్నారనే పుకార్లు కూడా వ్యాపించాయి. వరుణ్‌ తేజ్ సోదరి నటి నిహారిక పెళ్లికి లావణ్య హాజరయ్యారు. దీంతో అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.

మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి ముచ్చటతో మరో సారి వార్తలకెక్కాడు. త్వరలోనే వరుణ్‌ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరగబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో జూన్ లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ చేసుకుంటాడని, ఈ ఏడాది చివరలో పెళ్లి జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై మెగా కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. మెగా కుటుంబం నుంచి అధికారికంగా ఒక ప్రకటన వస్తేనే వీటిల్లో నిజం ఏమిటనేది తెలుస్తుంది.