Sunday, April 28, 2024
- Advertisement -

హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కల్ టీ..

- Advertisement -

చాలా మంది కాలాలతో సంబంధం లేకుండా టీ ని కప్పులకు కప్పులు తాగేస్తుంటారు. ముఖ్యంగా తమ రోజును టీతోనే ప్రారంభిస్తుంటారు. మరి ఈ టీ శీతాకాలమో, లేక వర్షాకాలమో అయితే వేడి వేడిగా తాగేయొచ్చు కానీ.. భానుడు తన ప్రతాపాన్ని చూపించే ఎండాకాలం అయితే కష్టమే. కానీ టీకి అలవాటు పడిన వారు మాత్రం ఆ వేడి ఈ వేడి.. ఎలా తట్టుకోవాలంటూ గాబరాపడిపోతున్నారు.

Also Read: నీళ్లు సరిగ్గా తాగకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

కానీ వారు టీ తాగితే కాని పనులు కూడా మొదలు పెట్టలేరు. మరి అలాంటి వారి కోసమే కోల్డ్ కాఫీ లాగానే.. కోల్డ్ టీ ని తాగేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. నిజమా అనుకుంటున్నారా.. నిజమేనండోయ్ ఈ హాట్ హాట్ వెదర్ కు కూల్ గా కోల్డ్ టీ మనముందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ కోల్డ్ టీలే ట్రెండ్ గా మారాయి. ఎండవేడిని భరించలేక.. ఇటు ఇష్టమైన టీని తాగలేని వారు ఈ కోల్డ్ టీని ఇష్టంగా తాగుతూ.. ఆస్వాదించొచ్చని నిపుణులు సలహానిస్తున్నారు.

Also Read: నడుము నొప్పి బాధ తగ్గాలంటే!

కోల్డ్ బ్రూ టీ పేరుతో ఆకులు బయటలభిస్తున్నాయి. వాటిని 6 నుంచి 12 గంటల పాటు నీటిలో వేస్తే చాలు ఎంచక్కా మనకు కోల్డ్ టీ తయారైనట్టేనండోయ్. ఇది రుచిగా ఉండటం తో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని కర్మ కెటిల్ వ్యవస్థాపకుడు ధీరజ్ అరోరా తెలియజేశారు.

Also Read : మధ్యాహ్నం పడుకుంటున్నారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -