- Advertisement -
సినీ నటుడు, మెగా హీరో వరుణ్ తేజ్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. హనుమాన్ మాలలో వరుణ్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలకగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు వరుణ్ తేజ్.
ఇటీవలే మట్కా సినిమాతో అలరించారు వరుణ్. సినిమా రిలీజ్ తర్వాత విదేశాలకు వెళ్లిన వరుణ్ తాజాగా హనుమాన్ మాలలో కనిపించారు. మట్కా తర్వాత వరుణ్ తేజ్…మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. హారర్ కామెడీ జోన్‌గా ఈ సినిమా తెరకెక్కనుండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.