Saturday, May 18, 2024
- Advertisement -

వరుణ్ పై చెర్రీ ఒత్తిడి..!

- Advertisement -

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోలందరూ మాస్ చిత్రాలు చేస్తూ మాస్ హీరోలుగా పేరుతెచ్చుకుంటున్నారు. చివరకు సాయిధరమ్ తేజ్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం తన మొదటి సినిమా నుండి అన్నిరకాల పాత్రలు చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

అయినా ఆయనకంటూ ఇప్పటికీ ఎలాంటి క్రేజ్ రాలేదు. దీంతో మరోసారి క్రిష్ దర్శకత్వంలో ‘రాయబారి’ చిత్రం చేయడం మంచిది కాదని, కాస్త మాస్ చిత్రాలపై దృష్టి పెట్టాలని మెగాక్యాంప్ లోని వారితో పాటు రామ్ చరణ్ కూడా తన సోదరుడికి సలహా ఇచ్చి ‘రాయబారి’లో నటించడం వల్ల అంత ప్రయోజయం ఏమీ ఉండదని పట్టుబట్టి మరీ వరుణ్ పై చెర్రీ ఒత్తిడి తెచ్చాడని, ఆయన సలహా మేరకే వరుణ్ తేజ్ ‘రాయబారి’ చిత్రం నుండి పక్కకు తప్పుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అంటే రాబోయే కాలంలో వరుణ్ తేజ్ కూడా మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడి ఆ టైపు చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -