Friday, March 29, 2024
- Advertisement -

కాలేజీ కి వెళ్లి గొడవపడిన వెంకటేష్ !!

- Advertisement -

విక్టరీ వెంకటేష్ ఎవరికైనా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, క్లాసు పీకడం లాంటివి చేస్తే అద్దిరిపోతుంది. ఇప్పుడు అదే పని తన మేనల్లుడు కోసం చేస్తున్నాడు వెంకటేష్.

నాగ చైతన్య – చందూ మొండేటి కాంబినేషన్ లో రాబోతున్న ప్రేమం సినిమా కోసం నాగ చైతన్య చేసిన ఎదో అల్లరి చూసిన ప్రిన్సిపాల్ ఆయన మావయ్య కి కబురు పంపించగా నిజ జీవితంలో కూడా మావయ్య అయిన వెంకటేష్ తన మేనల్లుడు కోసం సినిమా లో కూడా మావ పాత్ర చేస్తూ కాలేజీకి ఒస్తాడు.

చైతన్య చేసిన అల్లరి గురించి తెలుసుకుని అతనిక్ చివాట్లు పెడతాడు అనుకుంటే రివర్స్ లో ప్రిన్సిపాల్ కి క్లాసు పీకేసాడు. దీంతో ఆశ్చర్యపోయారు అందరూ. పిల్లలు అన్నాక అలాగే ఉంటారు, నీలా పప్పు సుద్దల్లా ఉంటారా ? ఉడుకు రక్తం తో ఉంటారు అంటూ ప్రినిస్పాల్ కి చుక్కలు చూపించాడు.

అంతే కాకుండా చైతన్య ని పిలిచి ఇక్కడ ఏంట్రా గొడవ నీకు జాలీగా ఉండాలి అనిపిస్తే ఇంటికి ఒచ్చేయ్యచ్చు కదా ఫుల్ ఫ్రీడం ఉంటుంది అంటూ అతనికీ ఒక రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు మావయ్య. ప్రేమం – తెలుగు వెర్షన్ లో తన మేనల్లుడు కోరిన కోరిక మేరకు వెంకటేష్ చేసిన ఈ సీన్ తాజాగా షూటింగ్ చేసారు, సీన్ చాలా బాగా ఒచ్చింది అని అంటున్నారు యూనిట్ సభ్యులు. ఒక పక్క బాబు బంగారం సినిమా చేస్తూనే అదే ప్రొడ్యూసర్ నిర్మిస్తున్న ఈ సినిమా లో కామ్యో చేసాడు వెంకీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -