Tuesday, May 21, 2024
- Advertisement -

ప్రభాస్ పెళ్లిపై వేణుస్వామి?

- Advertisement -

వేణుస్వామి..ప్రముఖ జ్యోతిష్యుడు. వీఐపీల జాతకాలు చెబుతూ ఫేమస్‌గా మారారు వేణుస్వామి. ఆయన చెప్పిన జాతకాల్లో చాలావరకు నిజం అవుతుండటంతో ఆయన జ్యోతిష్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వార్తలు చెప్పారు వేణు స్వామి.

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు స్వామి… ప్రభాస్ ఫ్యాన్స్ నేను ఏం మాట్లాడినా ట్రోల్ చేస్తుంటారు కానీ నేను చెప్పేది మాత్రం నిజం అన్నారు. ప్రభాస్ జాతకంలో దోషం ఉంది… అందుకే పెళ్లి కావడం లేదు అని తెలిపారు వేణుస్వామి. దోష నివారణ జరిగితే కానీ ప్రభాస్ కి పెళ్లి జరగదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ సినిమాల్లోకి ఎలా వచ్చాడో కూడా తనకు తెలుసని చెప్పగా వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

సలార్‌తో హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాతో పాటు సలార్ సీక్వెల్‌,సందీప్ వంగతో సినిమా, మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నారు.రీసెంట్‌గా మోకాలికి సర్జరీ కూడా చేయించుకున్నారు ప్రభాస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -