Monday, April 29, 2024
- Advertisement -

చరణ్‌ బర్త్‌ డే.. ‘గేమ్ ఛేంజర్’ ట్రీట్!

- Advertisement -

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ప్రముఖ దర్శకుడు శంకర్‌ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తూ వస్తుండగా షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా అది కాస్త వైరల్‌గా మారుతోంది.

తాజాగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించి అదిరే అప్‌డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. మొన్నటివరకు షెడ్యూల్‌కి షెడ్యూల్‌కి లాంగ్ గ్యాప్ తీసుకోగా ఇప్పుడు షూటింగ్ శరవేగంగా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టంట్ మాస్టర్స్ అన్బు రివ్ డైరెక్షన్ లో మూవీలోని కీలక యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తుండగా శంకర్ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రీకరణకి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారగా లను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసాడు. ఈ పిక్స్ లో శంకర్, అన్బు రివ్ కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన చరణ్ అభిమానులు.. వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు. కాగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. మూవీ టీజర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ని కూడా కన్ఫార్మ్ చేయనున్నారని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -