Monday, May 20, 2024
- Advertisement -

చిరు సినిమాకి ఇంకొ చిక్కొచ్చింది!!

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా “కత్తిలాంటోడు” జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అన్నారుగానీ ఇది ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు. ఈ సినిమా కోసం చిరంజీవి తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. చాలానే కష్టపడ్డారన్న సంగతి ఆయన లుక్ చూస్తేనే తెలిసిపొతోంది. అయితే ఇప్పుడు ఇంకొ చిక్కొచ్చింది.

ఇప్పటికి తగ్గింది సరిపొదనీ మరో 5 కేజీలు బరువు తగ్గితే బాగుంటుంది అని దర్శకుడు వినాయక్ చిరంజీవికి ఇచ్చిన సూచనతో మరోసారి ఈసినిమా షూటింగ్ వాయిదా పడుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఠాగూర్ సినిమా టైంలో ఉన్న చిరంజీవి లుక్ కావాలంటున్నాడట వినాయక్ అయితే చిరంజీవి ఎంత ప్రయత్నించినా వినాయక్ కోరిన లుక్ పూర్తిగా మారక పోవడంతో మరోసారి ఈసినిమా షూటింగ్ వాయిదా పడుతోంది అని అంటున్నారు. దీనికితోడు హీరోయిన్ విషయంలో కూడ తలెత్తుతున్న సమస్యలు వినాయక్ టెన్షన్ ని మరింత పెంచుతున్నాయట. రెమ్యూనరేషన్ చాలలేదని ఒక హీరోయిన్, చిరంజీవి‌తో చేయాలంటే నా కెపాసిటీ చాలదంటూ మరో హీరోయిన్ ఇలా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారు.

దీనితో ఇప్పటికే తయారు అయిన ఈ సినిమా స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు చేర్పులతో పాటు హీరోయిన్ సమస్య ఇలా ఎన్నో కారణాలు చిరంజీవిని తన 150వ సినిమా విషయంలో అయోమయంలో పడేస్తున్నట్లు తెలుస్తోంది. ఈవార్తలు ఇలా బయటకు రావడంతో చిరంజీవి తన 150 వ సినిమా విషయం మరికొద్ది రోజులు లేట్ చేస్తే స్టార్ డమ్ మరీ వెనక్కి వెళ్లే ప్రమాదముందంటూ చిరంజీవి అభిమానులు అందోళన పడుతున్నట్టు టాక్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -