Friday, May 10, 2024
- Advertisement -

సాహసం శ్వాసగా సాగిపో ట్రైలర్!

- Advertisement -

యువసామ్రాట్‌ నాగచైతన్య, డీసెంట్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏమాయ చేసావె’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మంజిమా మోహన్‌ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ‘ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే…’ పాటను, ‘షోకిల్లా’ సాంగ్‌ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఈ రెండు పాటలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇటివలే ‘చకోరి’ అనే సాంగ్ ను కూడా విడదల చేశారు. ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్ గా తెరకేక్కిందని తెలుస్తుంది.

ఈ రోజే ఈ చిత్రాన్నికి సంబంధించి ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తూంటే చైతూ లవర్ బాయ్ రోల్ అలాగే మంచి మాస్ యాక్షన్ రోల్ రెండు పాత్రలు చేసినట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మంజిమా కూడా మంచి నటన కనబరిచినట్లు కనిపిస్తుంది. ఇక రెహమాన్ సంగీతం చాలా అద్భుతంగా ఉంది. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మరో సూపర్ హిట్ నాగచైతన్న కొట్టినట్లే కనిపిస్తుంది.

{youtube}v=9kd3lOprII8{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -