Saturday, May 4, 2024
- Advertisement -

ఆమెనే పెళ్లి చేసుకుంటా – విశాల్

- Advertisement -

ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలేదు హీరో విశాల్. ఇన్నాళ్ళ తరవాత పెళ్లి గురించి నోరు విప్పాడు విశాల్. ఈ మధ్య కాలం లో హీరో విశాల్ కీ మాజీ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కీ మధ్యన ప్రేమాయణం జరుగుతోంది అని తమిళ మీడియా ఢంకా కొడుతోంది.

అందుకే విశాల్ కీ – శరత్ కీ గొడవలు అని కూడా అక్కడ మీడియా చెబుతోంది. ఈ మధ్య నడిగిర్ సంఘం ఎన్నికల్లో విశాల్ శరత్ కుమార్ ని ఓడించి తన సత్తా చాటుకున్నాడు కూడా. నిజజీవితంలోనూ శరత్‌కుమార్‌కు విశాల్‌ శత్రువుగా మారి తలనొప్పులు తీసుకొని వస్తున్నాడు. అందులోనూ ఎన్నికల్లో తన వాగ్దానమైన నడిగర్‌ సంఘానికి ఓ బిల్డింగ్‌ నిర్మించిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు విశాల్‌. సో… ఈ ప్రేమవ్యవహారం, విశాల్‌ వివాహం వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచిచూడాల్సివుంది…! పెళ్లి చేసుకుంటాను అది కూడా హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటాను అంటూ విశాల్ తన ప్రేమ కహానీ బయట పెట్టాడు. నా మనసులో ఒక వ్యక్తి ఉన్నారు వారినే పెళ్లి చేసుకుంటా అంటూ బహిరంగంగా చెప్పేసాడు. ఇంత చెప్పినోడు పేరు మాత్రం చెప్పట్లేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -